గుడివాడ: 27 కిలో మీటర్ల గ్రీన్ ఫీల్డ్ రోడ్డు

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి గురువారం సాయంత్రం ఢిల్లీలో కలిశారు. గుడివాడ ఫ్లై ఓవర్ కు అనుసంధానం చేసే రోడ్డుకు నిధులు మంజూరు చేసినందుకు కేంద్ర మంత్రికి ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు. గుడివాడ నుంచి కంకిపాడు వరకు 27 కి.మీ గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. రూ. 350 కోట్లతో పోర్ట్ రోడ్డులో 7 అండర్పాస్లు, 3 ఫ్లైఓవర్లు, బీచ్ రోడ్లో కూడా ఫ్లై ఓవర్ నిర్మాణం జరగనుంది.

సంబంధిత పోస్ట్