గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ, బక్రీద్ పండుగ త్యాగానికి, భక్తికి, విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. గురువారం గుడివాడలో ముస్లిం సోదరులు ఈ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. పట్టణంలోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద గల గుల్జార్ చౌక్ మసీదు ప్రాంగణంలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, కూటమి నాయకులు పాల్గొన్నారు.