ఎరువుల షాపుల యజమానులు, డీలర్లు యూరియా కొరత సృష్టిస్తే చర్యలు తీసుకుంటామని గుడివాడ ఏడిఏ ఎస్. కవిత ఎరువుల షాపుల యజమానులను హెచ్చరించారు. గురువారం ఉదయం గుడివాడలో ఎరువుల షాపులను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొన్ని షాపుల్లో అనుమతి లేని 828 కేజీల ఎరువులను సీజ్ చేసినట్లు తెలిపారు. యూరియా కొంటే వేరే ఏదైనా కొనాలి అని నిబంధనలు విధించవద్దని షాపుల యజమానులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏవో అనంతలక్ష్మి పాల్గొన్నారు.