గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గురువారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ పాలకుల వెన్నులో వణుకు పుట్టించిన గొప్ప వ్యక్తి అని, స్వాతంత్ర్య సంగ్రామంలో వారికి ఎదురొడ్డి నిలబడిన గొప్ప నాయకుడు అని తెలిపారు.