రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రజల సౌలభ్యం కోసం గుడివాడ పురపాలక సంఘ పరిధిలో ఆటో మ్యూటేషన్ (రిజిస్ట్రేషన్ సమయములోనే ఇంటి పన్ను పేరు మార్పు) ను ప్రవేశపెట్టిందని మున్సిపల్ కమిషనర్ మనోహర్ తెలిపారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇళ్లు, ఖాళీ స్థలాలకు సంబంధించి రిజిస్ట్రేషన్లు జరుగునపుడు రిజిస్ట్రేషన్ ఫీజుతో పాటుగా మ్యూటేషన్ ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దీనివల్ల ప్రజలకు ఇంటి పన్ను పేరు మార్పు ప్రక్రియ సులభతరం అవుతుంది.