గుడివాడ: వైసీపీ నేతలపై కేసు నమోదు

గుడివాడలో నాగవరప్పాడు వంతెన వద్ద లింగవరం గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈనెల 12న గుడివాడ నుంచి వెళ్తుండగా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక, ఉప్పాల రాము, కందుల నాగరాజు, మరో ఇద్దరు కారులో వెళ్తూ సెంటర్లో నిల్చొని ఉన్న తమను మీరు లింగవరం వెళ్లి ఏమి చేస్తారు అంటూ అసభ్య పదజాలంతో తీవ్రంగా దుర్భాషలాడి కారుతో తొక్కుకుని వెళ్లారని తెలుగు మహిళా నేత సునీత సోమవారం ఫిర్యాదు చేశారు. గాయాలై తాను రక్తపోటుతో కళ్లు తిరిగి పడిపోయినట్టు తెలిపారు. పోలీసులు 129(ఏ), 79, 3(5) బీఎన్ఎస్ సెక్షన్ల కింద దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్