గుడివాడ: విద్యుత్ శాఖ విజిలెన్స్ తనిఖీలు

గుడివాడ నియోజకవర్గంలో విజిలెన్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సిహెచ్. వాసు ఆధ్వర్యంలో అధికారులు 37 బృందాలుగా ఏర్పడి 3244 గృహా సర్వీసులు, 164 వాణిజ్య సముదాయాలు గురువారం తనిఖీ చేశారు. వాటిలో 308 సర్వీసులకు అదనపు లోడు వాడుతున్న 459 మొత్తానికి అపరాధ రుసుము రూ. 9,18,000 విధించారు. విద్యుత్ చౌర్యం చేయడం సామాజిక నేరమని, విద్యుత్ చౌర్యం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్