గుడివాడ: చికిత్స పొందుతూ ఎక్సైజ్ హెచ్సీ మృతి

నందివాడ మండలంలో ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న చల్లగుళ్ల పిచ్చేశ్వరరావు (59) రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. ఈనెల 9న గుడివాడ కోర్టు వెళ్లి తిరిగే సమయంలో, వీకేఆర్ ఇంజినీరింగ్ కాలేజీ వద్ద రోడ్డుపైకి వచ్చిన గేదెల వల్ల ప్రమాదం జరిగింది. గాయాలతో విజయవాడ ఆసుపత్రికి తరలించగా అక్కడే మరణించారు.

సంబంధిత పోస్ట్