చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని గుడివాడ పోలీసులు మైనర్లను హెచ్చరించారు. సోమవారం సాయంత్రం గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాలలో శక్తి టీం సిబ్బందితో కలిసి డ్రోన్ కెమెరాతో సర్వేలన్స్ చేస్తూ ఉండగా మితిమీరిన వేగంతో రెండు ద్విచక్రవాహనాలతో నలుగురు మైనర్లు వాహనాలు నడుపుతుండడం గమనించారు. వారి కుటుంబ సభ్యులను పిలిచి కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది.