గుడివాడలో టిడ్కో కాలనీ ఇంచార్జ్ నిరంజన్ జనసేన యువ నేత బ్యానర్ చించివేశారని ఆరోపిస్తూ, జనసేన శ్రేణులు మంగళవారం నిరసన ధర్నా చేపట్టారు. "జై జనసేన జై జై జనసేన" అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు, శ్రీనాథ్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.