గుడివాడ ఏలూరు రోడ్డులోని ప్రజావేదిక కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని పోలీస్ అధికారులతో ఎమ్మెల్యే రాము మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గంజాయి నియంత్రణకు తీసుకున్న చర్యలపై పోలీసులను ఎమ్మెల్యే అభినందించారు. పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. సమావేశంలో సీఐలు సోమేశ్వరరావు, శ్రీనివాస్, హనీష్ పాల్గొన్నారు.