గుడివాడ: చెరువులో మునిగి వ్యక్తి మృతి

గుడివాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోటూరు గ్రామ పంచాయతీ పెద్ద చెరువులో సుమారు 40 సంవత్సరాల వయస్సు గల మానసిక స్థితి సరిగా లేని వ్యక్తి మంగళవారం నీటిలో మునిగి మృతి చెందాడు. గత రెండు రోజులుగా మతిస్థిమితం లేక మోటూరు గ్రామంలో తిరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. గ్రామస్థులు అతన్ని ఈత కొడుతుండగా గమనించి బయటకు రావాలని పిలిచినప్పటికీ వినలేదని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్