గుడివాడ మండలం మల్లాయిపాలెంకు చెందిన ఓ వృద్ధుడు పద్మావతి మిల్లులో కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సైకిల్‌పై రైస్ మిల్లు వైపు వెళ్తుండగా, ఒక బైక్‌ను చూసి భయంతో సైకిల్ అదుపు తప్పి రోడ్డుపై పడిపోయాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, అనంతరం మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.