గుడివాడలోని ఎన్టీఆర్ స్టేడియంలో అండర్-14 బాలబాలికల జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు జనవరి 19వ తేదీ నుంచి ఐదు రోజులపాటు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే రాము వెల్లడించారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీల నిర్వహణపై ఆయన అధికారులతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో బాలసుబ్రమణ్యం, మున్సిపల్ కమిషనర్ మనోహర్ పాల్గొన్నారు.