గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బెట్టింగులు, పేకాట, వ్యభిచారం, గంజాయి వంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగితే సమాచారం ఇవ్వాలని వన్ టౌన్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సమాచారం తెలిస్తే సెల్ 8332983796కు తెలియజేయాలని, వివరాలు గోప్యంగా ఉంచబడతాయని హామీ ఇచ్చారు. నెంబర్ ప్లేట్లు లేని కార్లు, బైకులు, వాహనాలు గుడివాడ టౌన్ లోనికి అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు.