గుడివాడ: రోడ్డు ప్రమాదంలో పోలీసుకు తీవ్ర గాయాలు

నందివాడ మండలానికి చెందిన ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ చల్లగుళ్ల పిచ్చేశ్వరరావు (60) బుధవారం గుడివాడ కోర్టుకు వెళ్లి తిరిగి మోటార్ సైకిల్‌పై వస్తుండగా, ఏలూరు రోడ్డులోని వీకేఆర్ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటనలో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి, తరువాత విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్