కృష్ణా జిల్లా గుడివాడలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఈ ర్యాలీ చేపట్టారు. ఏలూరు రోడ్డు నుండి మార్కెట్ సెంటర్ వరకు సాగిన ఈ నిరసన ప్రదర్శనలో మాజీ మంత్రి కొడాలి నానితో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.