గుడివాడ బైపాస్ రోడ్డులోని శ్రీ సాయి షైనింగ్ స్టార్ స్కూల్‌లో పదవ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రతిభావంతులకు అవార్డుల ప్రదానం ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ, విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు.