గుడివాడ పట్టణం మెయిన్ రోడ్డులోని శ్రీ విఘ్నేశ్వర దేవాలయంలో సంకటహర చతుర్దశి పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం శ్రీ లక్ష్మీ గణపతి హోమ పూజలు ఘనంగా జరిగాయి. ఈ పూజల్లో పలువురు దంపతుల జంటలు పాల్గొని, పీటలపై కూర్చొని పూజలు చేశారు. లోక కళ్యాణార్థమై విశిష్టత కలిగిన ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని దేవాలయంలో లక్ష్మీ గణపతి హోమ పూజలు నిర్వహిస్తున్నట్లు చైర్మన్ శాయన రాజేష్ తెలిపారు.