గుడివాడ పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ శ్రీనివాస్ బుధవారం తెలిపారు. ముఖ్యంగా క్రికెట్ బెట్టింగ్, జూదాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పట్టణ ప్రజలు ఇలాంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్న సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.