గుడివాడలో జడ్పీ ఛైర్మన్ ఉప్పాల హారిక వెళ్తున్న కారుని టీడీపీ శ్రేణులు అడ్డగించడంతో శనివారం ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో హారిక, రాము దంపతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హారికను కొందరు అసభ్య పదజాలంతో దూషించారంటూ ఆమె భర్త రాము మండిపడ్డారు. కారు దిగేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని నిలువరించారు. రాము హారికలను ప్రత్యేక సిబ్బందితో అక్కడ నుంచి పంపారు.