గుడివాడ నాగవరప్పాడు సెంటర్లో వైసీపీ ఫ్లెక్సీలను తెలుగుదేశం కార్యకర్తలు పెట్రోల్ పోసి శనివారం సాయంత్రం తగలబెట్టారు. జగన్ పాలన రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం సవ్యంగా పాలిస్తుందని పేర్కొన్నారు. బాబు షూరిటీ మోసం గ్యారెంటీ వంటి కార్యక్రమాలను సహించబోమని హెచ్చరించారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.