ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ పై గుడివాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో వైఎస్ఆర్‌సీపీ నాయకులు గురువారం ఫిర్యాదు చేశారు. తమ పార్టీకి చెందిన మహిళా నేతలను, కార్యకర్తలను కించపరిచేలా కథనాలను ప్రసారం చేస్తున్నారని, ఛానల్ వేదికగా వైఎస్ఆర్‌సీపీ మహిళా నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇది మహిళా లోకాన్ని అవమానించిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.