గుడివాడ మోటారు క్రాస్ రోడ్డు వద్ద నేషనల్ హైవే-216పై శనివారం ఎస్ఐ చంటిబాబు ఆధ్వర్యంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపేవారు, సీట్ బెల్ట్ లేకుండా ప్రయాణించేవారు, మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు.