నందివాడ: మండలంలో రూ. 1. 80 కోట్లతో విలేజ్ హెల్త్ క్లినిక్ లు

గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ చేసే లక్ష్యంతో, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నియోజకవర్గ వ్యాప్తంగా విలేజ్ హెల్త్ క్లినిక్ ల నిర్మాణ పనులను ప్రారంభించారు. శనివారం నందివాడ మండలం జొన్నపాడు గ్రామంలో నూతనంగా నిర్మించనున్న విలేజ్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా, ఒక్క నందివాడ మండలం పరిధిలోనే రూ. 1. 80 కోట్ల నిధులతో ఐదు క్లినిక్ లను ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.

సంబంధిత పోస్ట్