నందివాడ: ప్రజల్లో ధైర్యం నింపేందుకు పల్లె నిద్ర కార్యక్రమం

ప్రజల్లో ధైర్యం నింపేందుకు పల్లెల్లో పోలీసులు నిద్ర చేస్తున్నట్లు సీఐ సోమేశ్వరరావు తెలిపారు. శుక్రవారం సాయంత్రం నందివాడ మండలం పోలుకొండ గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా ప్రజలతో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని, గ్రామాల్లో ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్సై శ్రీనివాసరావు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్