గుడివాడలో మరో మూడు నెలల్లో మాజీ మంత్రి కొడాలి నాని అడుగుపెట్టనున్నారని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఆదివారం పెడన వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. గుండ ఆపరేషన్ చేయించుకున్న కొడాలి నాని ఆరోగ్యం కుదుటపడటంతో తిరిగి వస్తున్నారని చెప్పారు. 'ఎవరొస్తారో రండి' అంటూ సవాల్ విసిరారు. ఈ వ్యాఖ్యలు కృష్ణా జిల్లా వ్యాప్తంగా వైరల్ కావడం జరిగింది.