2024 ఎన్నికల ఓటమి తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ మంత్రి కొడాలి నాని త్వరలో బీజేపీలో చేరనున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇటీవల తిరుమల పర్యటనలో మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేతో ఆయన సన్నిహితంగా కనిపించడం ఈ ఊహాగానాలకు బలం చేకూర్చింది. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎదురవుతున్న రాజకీయ సవాళ్లను ఎదుర్కోవడానికి ఆయన బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.