గుడివాడలో శనివారం మధ్యాహ్నం 12 గంటలు దాటినా సూర్యుడి జాడ లేదు. ఆకాశంలో నల్లని మేఘాల ఉద్ధృతి పెద్దగా లేనప్పటికీ వాతావరణం చల్లబడింది. ఎండ వేడి నుంచి ఉపశమనం లభించినప్పటికీ మధ్యాహ్నమే చీకటి పడినట్లుగా ఉండటంతో పట్టణ ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.