కృష్ణా జిల్లాలో పార్టీ కార్యక్రమానికి వెళ్లిన జడ్పీ ఛైర్‌పర్సన్ ఉప్పాల హారికపై గుడివాడలో టీడీపీ నేతలు దాడి చేయడం దారుణమని వైసీపీ అధినేత జగన్ ఆక్షేపించారు. దాడులను చూస్తే చంద్రబాబు పాలన శాడిజం, పైశాచికత్వంగా మారిందని విమర్శించారు. మహిళపై ఇలా దాడి చేయాల్సిన అవసరం ఏంటి అని జగన్ X వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.