పెనుగంచిప్రోలు శివారులోని రైతు రాజేశ్ నాయక్ పొలంలో ఆరబోసిన సుమారు 3 క్వింటాళ్ల మిర్చి దొంగతనానికి గురైంది. దాదాపు రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టి సాగు చేసిన మిర్చిని విక్రయించే లోపే దొంగలు ఎత్తుకెళ్లడంతో బాధితుడు కన్నీరుమున్నీరవుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన రైతు, తనకు న్యాయం చేయాలని కోరాడు.