రైతు బజారు ఏర్పాటు చేయండి. కలెక్టర్ కు వినతి పత్రం

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశకు పెనుగంచిప్రోలు గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు. తిరుపతమ్మ అమ్మవారి పుణ్యక్షేత్రమైన పెనుగంచిప్రోలులో రైతు బజార్ ఏర్పాటు చేయాలని వారు కోరారు. గ్రామంలో 25 వేల మంది జనాభా నివసిస్తున్నారని, అనుబంధ గ్రామాల ప్రజలు కూడా ఇక్కడికే వస్తారని తెలిపారు. రైతు బజార్ లేకపోవడంతో కూరగాయల ధరలు ఎక్కువగా ఉన్నాయని, పేద ప్రజలు కొనుగోలు చేయలేకపోతున్నారని పేర్కొన్నారు. నందిగామ, జగ్గయ్యపేట రైతు బజార్లతో పోలిస్తే ఇక్కడ ధరలు రెట్టింపు ఉన్నాయని వివరించారు. మండల కేంద్రమైన పెనుగంచిప్రోలులో రైతు బజార్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్