ముండ్లపాడులో ఇళ్ల ముందుకు వరద నీరు

గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పెనుగంచిప్రోలు మండలం ముండ్లపాడులో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎగువ ప్రాంతాలలో కురిసిన వర్షాల వల్ల కాలువలు పొంగిపొర్లడంతో, గ్రామంలోని లోతట్టు ప్రాంతాల ఇళ్లలోకి వరద నీరు చేరింది. రహదారులపై సుమారు 3 అడుగుల ఎత్తున నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్