మంగళవారం చిల్లకల్లు వద్ద పోలీసులు 6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీమాల నవీన్, సయ్యద్ బాజీ, షేక్ అన్వర్లు ఒడిశా నుంచి గంజాయిని తరలిస్తుండగా వీరిని అరెస్ట్ చేశారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో గంజాయి అమ్ముతున్నారని, ముఠాలోని ఒకరు పరారైనట్లు జగ్గయ్యపేట సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.