జగ్గయ్యపేట: పూర్తిగా నష్టపోయిన మిర్చి రైతులు

ఈ ఏడాది సుమారు 30 వేల ఎకరాల్లో రైతులు మిర్చి పంట సాగు చేశారు. వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాల్లో ఎక్కువ విస్తీర్ణంలో సాగైంది. ఎకరాకు రూ. లక్ష పెట్టుబడి అయ్యింది. పూత, పిందె దశలో ఉన్న తోటలు మొంథా తుఫాన్ కారణంగా దెబ్బతిన్నాయి. పల్లపు ప్రాంతాల్లో నీళ్లు నిలవడంతో తోటలు ఎర్రబడ్డాయి, మొక్కలు ఒరిగాయి. కొమ్మలు విరిగి, పూత రాలిపోయింది. నిలబెట్టినప్పటికీ, కాపుపై తీవ్ర ప్రభావం పడి, ఆశించిన దిగుబడులు రావడం కష్టమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడి కూడా రూ. 2 లక్షలు దాటుతుందని అంటున్నారు.

సంబంధిత పోస్ట్