జగ్గయ్యపేట పట్టణ ప్రాంత వాసులకు 3 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు 4 సెంట్లు చొప్పున ప్రభుత్వం నివేశన స్థలాలు ఇవ్వాలని సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు దాటినా పేదలకు ఇచ్చిన హామీని నెరవేర్చడం లేదని పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం నివేశ స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో శ్రీనివాస్, కృష్ణ పాల్గొన్నారు.