వత్సవాయి మండలం మంగోల్లులో శనివారం వివాద సంఘటన జరిగింది. గత రాత్రి జరిగిన స్వల్ప గొడవను మనుసులో పెట్టుకుని ప్రత్యర్థులు కత్తితో దాడి చేశారు. సంఘటనలో తండ్రి రాయవరపు నాగేశ్వరావు (48) కొడుకు శ్రీకాంత్ (23) గాయపడ్డారు. బంధువులు క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.