జగ్గయ్యపేటలోని జెడ్పీ బాయ్స్ హైస్కూల్లో జరిగిన పేరెంట్స్, టీచర్స్ మీటింగ్లో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, ఎన్నారై కంటమనేని హేమ ముఖ్యఅతిథిలుగా పాల్గొన్నారు. హేమ అందించిన రూ. 46. 5లక్షల విరాళంతో ఏర్పాటు చేసిన గ్రౌండ్ డెవలప్మెంట్ పనులను, లైబ్రరీ, కంప్యూటర్లను ఎమ్మెల్యేతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో విద్యారంగానికి స్వర్ణయుగం మొదలైందని స్పష్టం చేశారు.