పెనుగంచిప్రోలు గ్రామంలో శుక్రవారం ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య తూర్పు బజార్ ఎస్సీ కాలనీలోని అర్హులైన లబ్ధిదారులకు కొత్తగా మంజూరైన పెన్షన్లను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు వృద్ధులు, వికలాంగులు, వితంతువుల కోసం పెన్షన్లు అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి పేద కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.