ఓ బాధితుడికి ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య సాయం చేశారు. జగ్గయ్యపేట మండలం మల్కాపురానికి చెందిన మధుసూదన్ రావు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న విషయం ఎమ్మెల్యే దృష్టికి వెళ్లింది. దీంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే, సీఎం సహాయనిధి కోసం సిఫార్సు లేఖ రాసి పంపించారు. దీంతో సహాయనిధి నుంచి రూ. లక్ష విలువైన LOC(లెటర్ ఆఫ్ క్రెడిట్) మంజూరైంది. దాన్ని ఎమ్మెల్యే గురువారం బాధితుడికి అందజేశారు.