జగ్గయ్యపేట మండలం, గౌరవరం గ్రామ రైతులు అకాల వర్షంతో తీవ్రంగా నష్టపోయారు. సుమారు 350 ఎకరాల ప్రత్తి, 100 ఎకరాల మిర్చి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో, గురువారం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీరామ్ గోపాల్ తాతయ్య, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. రైతులకు ప్రభుత్వం నుండి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.