జగ్గయ్యపేటలోని ముత్యాలమ్మ బజారులో వేంచేసి ఉన్న ముత్యాలమ్మ అమ్మవారిని గురువారం ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య దర్శించుకున్నారు. శ్రావణమాసం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. నియోజకవర్గ ప్రజలకు సమృద్ధి, సుఖ శాంతులు కలగాలని ప్రార్థించారు. పూజల్లో మున్సిపల్ ఛైర్మన్ రాఘవేంద్ర కూడా పాల్గొన్నారు.