జగ్గయ్యపేట మండలం సీతారామపురంలో గంధం పద్మ ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీకైన కారణంగా అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య శుక్రవారం అక్కడికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం దగ్ధమైన ఇంటిని పరిశీలించి తగిన సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.