పెనుగంచిప్రోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారికి ఆషాడ మాసం సందర్భంగా ఎస్సై కుటుంబ సభ్యులతో కలిసిఆదివారం సారే సమర్పించుకున్నామన్నారు. అనంతరం, దేవస్థానం అధికారులు వేద పండితుల ఆశీర్వచనం, స్వామివారి శేష వస్త్రం తీర్థప్రసాదాలు అందజేశారు. జగ్గయ్యపేట సీఐ వెంకటేశ్వరరావు దంపతులు, పెనుగంచిప్రోలు ఎస్సై అర్జున్ దంపతులు, వత్సవాయి ఎస్సై ఉమామహేశ్వరరావు, చిల్లకల్లు ఎస్సై సూర్య శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది పాల్గున్నారు.