పెనుగంచిప్రోలు మండలం నవాబుపేటలోని రైతు సేవ కేంద్రాన్ని, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని కలెక్టర్ జి. లక్ష్మీశ మంగళవారం ఆర్డీఓ బాలకృష్ణతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు వ్యవసాయంలో రసాయనాల వాడకాన్ని తగ్గించి, సేంద్రియ పద్ధతులను అమలు చేయాలని, ఆధునిక సాంకేతికతను వినియోగించాలని సూచించారు.