వేలాదిలో కొలువై ఉన్న శ్రీ యోగానంద లక్ష్మి నరసింహస్వామిని సోమవారం జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ గోపాల్ తాతయ్య దర్శించుకున్నారు. దండిగా వానలు పడి రైతన్నలకు సకాలంలో పంటలు వేసుకునేందుకు సహకరించాలని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఒకప్పుడు వర్షాలు పడాలంటే లక్ష్మీ నరసింహ స్వామిని పూజించుకుంటే కచ్చితంగా వర్షాలు పడతాయని ప్రజల నమ్మకం అని అన్నారు.