ఎన్.టి.ఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో మొంథా తుఫాను కారణంగా అనుమంచిపల్లి, బలుసుపాడు గ్రామాల్లో వరి, ప్రత్తి, మిరప పంటలు దెబ్బతిన్నాయి. ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) గారు ప్రభావిత ప్రాంతాలను సందర్శించి, రైతుల బాధలను తెలుసుకున్నారు. పంటల నష్టాన్ని పరిశీలించి, అధికారులతో చర్చించిన ఆయన, ప్రతి రైతుకూ ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా చూస్తానని, తేమ శాతం ఎక్కువగా ఉన్న ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతు పక్షపాతి అని, వారికి న్యాయం జరిగేలా చూసుకుంటారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, రైతులు పాల్గొన్నారు.