జగ్గయ్యపేటలో వైసీపీ నాయకుడు చిన్న రాజగోపాల్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను అసభ్య పదజాలంతో దూషించడాన్ని నిరసిస్తూ జనసైనికులు శనివారం పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఉపముఖ్యమంత్రిని అనుచిత వ్యాఖ్యలతో కించపరిచారని జనసేన కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. సదరు వైసీపీ నేతపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.