చిల్లకల్లులో అమ్మవారి ముందు పోలీసుల చిందులు!

బుధవారం పెనుగంచిప్రోలుకు తరలివెళ్తున్న శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి పల్లకీ యాత్రలో అపురూప దృశ్యం ఆవిష్కృతమైంది. చిల్లకల్లు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న అమ్మవార్లకు సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐలు స్వాగతం పలికారు. పోలీస్ స్టేషన్ తరఫున భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించి పూజలు చేశారు. అమ్మవారి పల్లకీ ముందు పోలీసులు ఉత్సాహంగా నృత్యాలు చేసి తమ భక్తిని చాటుకున్నారు.

సంబంధిత పోస్ట్