జగ్గయ్యపేటలో ప్రజా దర్బార్ కార్యక్రమం

జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు మండల పరిషత్ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య, కేడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ శ్రీ నెట్టెం రఘురాం పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత శాఖాధికారులతో మాట్లాడి, తక్షణ పరిష్కార చర్యలు చేపట్టేలా సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకునేలా చూడటం జరిగింది.

సంబంధిత పోస్ట్